36వ డివిజన్, చింతల్ మహిళలకు అండగా నిలుస్తున్న ఆడెపు పౌండెషన్

వరంగల్ జిల్లా : ఈ దేశ అస్థిత్వానికి, అభివృద్ధికి, జాతిమనుగడకు స్త్రీ పాత్ర ఎంతోకీలకం అని… మహిళలు కూడా అన్ని రంగాలలో రానించాలని ముక్యంగా వరంగల్ పట్టణ 36వ డివిజన్ కు చెందిన నిరుపేద, మధ్యతరగతి మహిళలకు చేయూతను అందించాలనే ఉద్దేశ్యంతో ఆడెపు ఫాండెషన్ ఆధ్వర్యంలో వరంగల్, చింతల్ దగ్గర వీనస్ పబ్లిక్ స్కూల్ లో ఏర్పాటు చేసిన “మహిళా సాధికారత” కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రముఖ వక్త, మహిళ అభ్యుదయ వాది, పోలేపాక మోహన్ గారిని ఆడెపు ఫౌండేషన్ చైర్మన్ ఆడెపు వెంకటేష్ గారు స్వాగతం పలికిన అనంతరం… మోహన్ గారు మాట్లాడుతూ మహిళ అంటే కేవలం వంటిటీకి పరిమితం కాదని నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాలలో రానిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం వారికీ చేయూతను ఇస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, డ్వాక్రా రుణాలు, ముద్ర లోన్స్, ఇంకా ఇట్టివల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజనలో కూడా ప్రత్యేకంగా మహిళల కోసం కుట్టు మిషన్లు పంపిణి చేసి కుట్లు, అల్లికలు లాంటివి నేర్చుకొని వారు మహిళా సాధికారతను సాదించాలని ఆయన కోరడం జరిగింది.