సర్వేజనా సుఖీనోభవంతు
మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్
ఘనంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవ వేడుక ప్రారంభం
గణనాధుడి విగ్రహ ప్రతిష్టాపన, ప్రత్యేక పూజలు చేసిన దాస్యం కుటుంబసభ్యులు
సర్వజనులు అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆ విఘ్నేశ్వరుడిని మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ పూజించారు. బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో శనివారం రోజున గణనాధుడిని ప్రతిష్టించారు. అనంతరం కుటుంబసమేతంగా పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భారతీయ పండుగలు ప్రకృతిని పూజించేవని, మట్టి వినాయకులనే పూజించాలని కోరారు. పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడుదామని అన్నారు. గణేష్ మండపాల నిర్వహాకులకు, ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయక మండపాలు ఆధ్యాత్మీక బాటలోనే నిర్వహించాలని కోరారు. చెరువులను, చెట్లను, ప్రకృతిని పరిరక్షిస్తూ… పండుగలను నిర్వహించుకుందామని పిలుపునిచ్చారు. వినాయకుడి అనుగ్రహం విద్యార్థులపై ఉండాలని, వారు ఉత్తీర్ణులు కావాలని, ఉత్తీర్ణులు అయిన వారికి ఉద్యోగాలు లభించాలని, వ్యాపార రంగాల్లో అందరికీ మంచి జరగాలని, మరీ ముఖ్యంగా రైతులకు మంచి పంటలు, గిట్టుబాటు ధరలు లభించాలని ప్రార్థించారు. ప్రజలందరికీ శుభం జరగాలని ఆ భగవంతుడిని వేడుకున్నారు.
కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, కార్పొరేటర్ చెన్నం మధు, మాజీ డిప్యూటీ మేయర్ సిరాజుద్దీన్, మాజీ కార్పొరేటర్ దాస్యం విజయ్ భాస్కర్, జోరిక రమేష్, నాయకులు రవీందర్ రావు, సదాంత్, వెంకన్న, రామ్మూర్తి, రాజు, రఘు, మహేష్, విద్యార్థి నాయకులు ప్రశాంత్, రాకేష్ యాదవ్, శ్రీకాంత్ చారి, పవన్ కుమార్, జేకే, యాకుబ్, తదితరులు పాల్గొన్నారు.