ప్రెస్ నోట్:
ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్య వైద్య సంస్థల పరిశీలన యాత్రలో భాగంగా శనివారం నాడు ఎల్కతుర్తి
మండలంలో గోపాల్పూర్ గ్రామంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ధర్మ సమాజ్ పార్టీ నాయకులు
సందర్శించి అక్కడి సమస్యలను విద్యార్థులను మరియు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు వసతిగృహం శిథిలావస్థలో ఉందని భవనం
స్లాబ్ పెచ్చులుగా ఊడిపోవడం వలన విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో అక్కడ ఎలాంటి ప్రమాదం జరిగిన ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి నూతన భవనాన్ని నిర్మించాలి టాయిలెట్స్ మరియు స్నానపు గదులకు మరమ్మత్తులు చేయించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మంద రమేష్ ఎల్కతుర్తి మండల కన్వీనర్ బొంకూరి రాజు మరియు ఎల్తూరి రాజేష్ పాల్గొన్నారు.