ఆమరణ నిరహార దీక్ష 12 వ రోజు


*బీసీ ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న రాష్ట్ర ప్రభుత్వం – చాపర్తి కుమార్ గాడ్గే ప్రాణాలకు ఏదయినా అయితే రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి కేడల ప్రసాద్ డిమాండ్*

*చాపర్తి కుమార్ గాడ్గే గారు గీసుగొండ లోని తన  నివాసం లో 12వ రోజు ఆమరణ నిరహార రోజు దీక్ష కొనసాగింపు…* *కామారెడ్డి లో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన హామీ బీసీ లకు చట్ట సభల్లో 42 శాతం రిజర్వేషన్ లు స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయాలని  12వ రోజు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు…*
*రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రాహుల్ గాంధీ గారి హామీని రేవంత్ రెడ్డి గారు నిలబెట్టుకోవాలని మరియు చాపర్తి కుమార్ గారి ఆమరణ నిరాహార దీక్షను విరమింపచేయాలని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు ధర్మ సమాజ్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కేడల ప్రసాద్ గారు డిమాండ్ చేశారు, ఈ దీక్షకు మద్దతు ప్రకటించిన తెలంగాణ అంబేద్కర్ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు గద్ధల కుమారస్వామి గారు మాట్లాడుతూ దేశ వ్యాప్త జనగణన లో కుల గణన చేసి దా మా షా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తేనే సామాజిక న్యాయం జరిగి దేశంలో ఆర్థిక అసమానతలు తొలగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ గీసుకొండ మండల అధ్యక్షులు సిలువేరు రవీందర్ మహారాజ్, చాపర్తి రాజు తదితరులు పాల్గొన్నారు*