దుర్గం చెరువులోని 204 భవనాలకు ‘హైడ్రా’ నోటీసులు
హైడ్రా’ కూల్చివేతలతో ఆక్రమణదారులు హడలెత్తిపోతున్నారు. హైదరాబాద్ దుర్గం చెరువులోని కాలనీల్లో ఇటీవల జీహెచ్ఎంసీ అధికారులు 204 ఇళ్లకు నోటీసులివ్వడంతో ఆందోళన చెందుతున్నారు. నోటీసులు అందుకున్న నిర్మాణాల్లో సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి, పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు, సినీ, రాజకీయ, ప్రముఖులు నివసించే భవనాలు ఉండటం గమనార్హం. హైటెక్‌సిటీలోని రాయదుర్గ్, మాదాపూర్ పరిధిలో దుర్గం చెరువు ఉండగా చుట్టూ వేలాది విలాసవంతమైన భవనాలు ఉన్నాయి.