ఢిల్లీలోని బీఆర్ఎస్ ఆఫీసులో

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షలు తెలిపారు.ఎంపీ రవిచంద్ర, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్,మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవిత,దివ్యాంగుల ఆర్థిక సహకార సంస్థ మాజీ ఛైర్మన్ డాక్టర్ వాసుదేవ రెడ్డి తదితర ప్రముఖులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావును బుధవారం ఢిల్లీలోని బీఆర్ఎస్ ఆఫీసులో కలిసి కవిత విడుదల పట్ల హర్షం వ్యక్తం చేశారు.