కవిత ఆవేశం తగ్గించుకోవాలి.. వచ్చింది బెయిల్ మాత్రమే: టీజీ వెంకటేశ్.

తీహార్ జైలు నుంచి రిలీజ్ అయ్యాక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్స్ పై మాజీ మంత్రి, బీజేపీ నేత టీజీ వెంకటేశ్ స్పందించారు. కవిత ఆవేశం తగ్గించుకోవాలన్నారు. శశికల లాగా అంతు తేలుస్తానంటూ మాట్లాడటం సరికాదన్నారు. కవిత మాట్లాడే భాష అభ్యంతకరంగా ఉందని, సవాళ్లు విసరడం సరికాదని చెప్పారు. కవితకు వచ్చింది బెయిల్ మాత్రమేనని.. కేసు కొట్టివేయలేదని చెప్పుకొచ్చారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది ఫేక్ అన్న వెంకటేష్.. అలా రాజీపడుంటే కవిత కామెంట్స్ మరోలా ఉండేవన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న హైడ్రా నిర్ణయం బాగుందని దీన్ని స్వాగతిస్తున్నామని చెప్పుకొచ్చారు. చెరువులను బతికించుకుంటే బాగుంటుందని టీజీ వెంకటేశ్ అభిప్రాయపడ్డారు. ఇక ఏపీలో కూడా చెరువులను కాపాడలన్నారు వెంకటేష్.