పల్లా మా భూమిని కబ్జా చేశారు

ఆందోళన… వెంకటాపూర్లో తీవ్ర ఉద్రిక్తత.


మేడ్చల్ జిల్లా పోచారం పోలీస్ స్టేషన్ పరిధి వెంకటాపూర్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన నీలిమ మెడికల్ కాలేజీ వద్ద కొందర బాధితులు ఆందోళనకు దిగారు. పల్లాకు చెందిన గ్రాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్టు తమ భూమిని కబ్జా చేశారని ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పల్లా వర్గీయులకు, బాధితులకు మధ్య తోపులాట జరగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. వెంకటాపూర్ గ్రామ సర్వే రెవెన్యూ నెంబర్ 796 లోని 11ఎకరాల 20గుంటలోని ఏడు ఎకరాల 20 గుంటలను గ్రాయత్రి ఎడ్యుకేషనల్ సోసైటీతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని.. మిగితా నాలుగు ఎకరాల తమ భూమిని పల్లా రాజేశ్వర్ రెడ్డి తన అనుచరలతో కలిసి కబ్జా చేశారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు.