కబ్జా చేసిన చెరువుల స్థలాల్లో ఉన్న భవనాలను కూల్చివేయడం జరుగుతుంది అది బాగానే ఉంది అదే విధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో కబ్జా చేయబడిన చెరువు భూములలో ముఖ్యంగా వరంగల్ హనుమకొండ జిల్లాల బీసీ ఎస్సీ ఎస్టీ 95% ప్రజల చేతులతో శ్రమతో తవ్వి నిర్మించబడ్డ చెరువులైన భద్రకాళి, వడ్డేపల్లి చెరువు వడ్డేపల్లి చిన్న చెరువు, కాలువల పక్కకు ఉన్న ప్రాంతాలలో అక్రమంగా నిర్మాణమైన భవనాలను కూల్చివేసి ప్రభుత్వ చిత్తశుద్ధిని చూయించుకోవాలి ఆక్రమించిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని భూమిలేని నిరుపేద లైన బీసీ ఎస్సీ ఎస్టీ అగ్రవర్ణ పేదలకు ఇల్లు కట్టించాలి లేదా వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా చేసి పంచాలి అని ధర్మ సమాజ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు మంద రమేష్ డిమాండ్ చేయడం జరుగుతుంది