కర్ణాటకలో భార్య ఇంట్లో, భర్త చెరువులో శవమై కనిపించారు

Aug 23, 2024,

కర్ణాటకలో భార్య ఇంట్లో, భర్త చెరువులో శవమై కనిపించారు
కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్వాతి(21), మోహన్(26) అనే దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. స్వాతి మంగళవారం సాయంత్రం తన ఇంట్లో ఉరివేసుకుని విగత జీవిగా కనిపించగా, ఆమె భర్త మోహన్ బుధవారం ఉదయం ఇంటికి కిలోమీటరు దూరంలోని ఓ చెరువులో శవమై కనిపించాడు. ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.