ఇస్రో ఇప్పటికి ఆరు రకాల వాహక నౌకలు రూపొందించి 97 ప్రయోగాలు చేపట్టింది. చిన్న ప్రయోగాల నుంచి చంద్రయాన్-1, మంగళయాన్, ఆదిత్య-ఎల్ 1 వంటి భారీ ప్రయోగాలను విజయవంతంగా చేపట్టింది. చంద్రయాన్-2 చివరి నిమిషంలో విఫలమైనా చంద్రయాన్-3 ప్రయోగం ద్వారా సాప్ట్ ల్యాండింగ్ చేయడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. భవిష్యత్‌లో గగన్‌యాన్ ద్వారా మానవుడిని అంతరిక్షంలోకి పంపడమే ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది