Aug 23, 2024,
తెలంగాణ ఆర్టీసీకి సంబంధించి రోజుకో ఘటన వెలుగులోకి వస్తోంది. తాజాగా 55 మంది ఎక్కాల్సిన బస్సులో 110 ఎక్కారు. సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వరంగల్ వెళ్తోంది. బస్సు కెపాసిటీకి మించి ప్రయాణికులు ఎక్కడంతో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో డ్రైవర్ బస్సును నడి రోడ్డుపై నిలిపేశాడు. ఇంత మంది ఎక్కడంతో సైడ్ వ్యూ మిర్రర్ కూడా కనబడట్లేదని.. ఇలా అయితే బస్సు ఎలా నడపాలని డ్రైవర్ అసహనం వ్యక్తం చేశారు. కొందరు ప్రయాణికులు దిగాక బస్సును ముందుకుపోనిచ్చాడు.