అందరికీ రుణమాఫీ చేసి తీరాల్సిందే
100 శాతం రుణమాఫీ చేసే వరకు బీఆర్ఎస్ పోరాడుతుంది
మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్
మొదట రేవంత్ రెడ్డి అడ్డగోలు వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా పార్టీ కార్యాలయంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో గురువారం రోజున ప్రొఫెసర్ జయశంకర్ సర్ స్మృతివనం (ఏకశిలా పార్కు) వద్ద ధర్నా
బీఆర్ఎస్ పార్టీ కార్యానిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారకరామారావు పిలుపు మేరకు నిరసన కార్యక్రమం
అనంతరం మాట్లాడుతూ…
ఎద్దు ఎడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు…
రైతులను రేవంత్ సర్కార్ మోసం చేస్తోంది
కేసీఆర్ ప్రభుత్వం రైతులను రాజులు చేస్తే… కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్ల పాలు చేస్తోందని ఆరోపించారు
రైతు రుణమాఫీ పూర్తిగా చేస్తామని చెప్పి ఎన్నికల్లో లబ్ధి పొందిన కాంగ్రెస్ నేడు కొంత మందికే చేసే రైతులను మోసం చేసిందని విమర్శించారు.
ముఖ్యమంత్రి రుణమాఫీ పూర్తి అయ్యిందని అంటాడు… మంత్రులు ఇంకా చెయ్యలేదు అంటారు
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ 40 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పింది, కేబినెట్ సమావేశంలో 31 వేల కోట్లని ప్రకటించారు, బడ్జెట్లో 26 వేల కోట్లు మాత్రమే కేటాయించారు, కానీ మొన్న మంత్రులు ప్రకటిస్తూ 17వేల కోట్లు మాత్రమే మాఫీ చేశామని అన్నారు… కానీ రైతులు ఖాతాలో పడ్డది మాత్రం 7500 కోట్లు మాత్రమే
రాష్ట్రంలో ఉన్న 22 లక్షల రైతుల పరిస్థితి ఏంటి
కాంగ్రెస్ 8 నెలల పాలనలో కరెంటు కోతలు, బోనస్ పై బోగస్ మాటలు, అన్ని పథకాల్లోనూ కోతలే
కల్లోల కాంగ్రెస్… రైతులను ఆగమాగం చేస్తోందని ఆరోపించారు
రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ అయ్యే వరకు రైతులకు అండగా బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు
రైతుబంధు నిధులు అతీగతి లేదని అన్నారు
రైతులకు బోనస్ విషయంలోనూ కాంగ్రెస్ బోగస్ మాటేలే అయ్యాయని విమర్శించారు.
రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు ప్రభుత్వంపై పోరాటంలో కలిసి రావాలని కోరారు.
రైతుబంధు 15 వేలు ఎకరాకి ఇస్తామని అన్నారు… మొత్తానికే ఎగ్గొట్టారు
కౌలు రైతులకు, రైతు కూలీలకు సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇస్తామన్నారు… అతీగతి లేదు
రుణమాఫీ కాక రైతులు ఆందోళన చెందుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు
అనంతరం అదాలత్ లోని ఐఓబి బ్యాంక్ అధికారులకు వినతిపత్రం అందజేశారు
కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా మసూద్, కార్పొరేటర్లు బొంగు అశోక్ యాదవ్, చెన్నం మధు, నర్సింగ్, రంజిత్ రావు, రాధికా రెడ్డి, దివ్యశ్రీ రాజు నాయక్, పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, జనార్దన్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు బాబు రావు, సారంగపాణి, జోరిక రమేష్, వేణు, రైతు సమన్వయ సమితి సభ్యులు చుంచు కృష్ణ, నాయకులు నరెడ్ల శ్రీధర్, కుమార్ యాదవ్, అశోక్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు, మహిళలు, రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు.