తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించిన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంక్ సిబ్బంది


హైదరాబాద్

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర కో ఆపరేటివ్ చైర్మన్ శ్రీ దేవేందర్ సింగ్ శ్యామ్ గారు మరియు మేనేజింగ్ డైరెక్టర్ శర్వన్ కుమార్ గారి బృందం సభ్యులు ఈరోజు తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించిన సందర్బంగా చైర్మన్ మార్నెనీ రవీందర్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది…

ఈ సందర్బంగా వారికి బ్యాంక్ యొక్క ప్రధాన ఆర్థిక వివరాలు, టర్నోవర్స్,బ్యాంక్ పురోగతి పై, ఐటి రంగం పై,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసిన రైతు రుణ మాఫీ గురించి వారి బృందానికి చైర్మన్ గారు వివరించారు..

అనంతరం చైర్మన్ మరియు ఎండీ గారిని టేస్కాబ్ చైర్మన్ గారు సన్మానించడం జరిగింది…

ఈ కార్యక్రమంలో టేస్కాబ్ సిజిఏం జ్యోతి గారు, ఇఎ శ్రీనివాస రావు గారు మరియు హిమాచల్ ప్రదేశ్ ఎస్ సిబి బృందం సభ్యులు పాల్గొన్నారు…