Aug 21, 2024,
జన్ పోషణ్ కేంద్రాలుగా రేషన్ షాపులు
దేశంలోని రేషన్ షాపులను జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చే పైలట్ ప్రాజెక్టుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. డీలర్ల ఆదాయం పెంచడం, ప్రజలకు పోషక పదార్థాలు అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. యూపీ, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణలోని 60 రేషన్ షాపులను ఇందుకోసం ఎంపిక చేసింది. ఈ షాపుల్లో తృణధాన్యాలు, పప్పులు, పాల ఉత్పత్తులు, రోజువారీ నిత్యావసర సరుకులు వంటి 3,500 ఉత్పత్తులు విక్రయించనున్నారు.