Aug 21, 2024,
ప్రమోషనల్ కాల్స్, మెసేజ్‌లు పంపే అనధికార టెలిమార్కెటర్లకు హెచ్చరికలు జారీ
వినియోగదారులను మోసపూరిత కాల్స్ నుంచి రక్షించేందుకు, మెసేజింగ్ సేవలు దుర్వినియోగం కాకుండా ట్రాయ్ సంస్థ ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. స్పామ్ కాల్స్ చేసే అనధికార టెలిమార్కెటర్ల కనెక్షన్లను తొలగించి, 2ఏళ్ల పాటు వారిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాల్సిందిగా టెల్కోలను ట్రాయ్ ఆదేశించింది. ప్రమోషనల్ కంటెంట్ కోసం టెంప్లెట్లను దుర్వినియోగం చేసే వారిని అడ్డుకోకుంటే, సెండర్లపై ట్రాయ్ చర్యలు తీసుకోనుంది. నెల రోజుల పాటు వారి సేవలను నిలిపివేస్తామని హెచ్చరించింది.