పెద్దల పండుగకు ‘గాంధీ’ గండం.
హైదరాబాద్, అక్టోబర్ 02
ఇక మహాలయ అమావాస్యను పెద్దల పండుగగా భావిస్తారు. ఈ పక్షం రోజులు స్వర్గస్తులైనవారికి తర్పణం చేయడం ద్వారా వారి ఆత్మలు శాంతస్తాయని భావిస్తారు. అందుకే తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పిత్రు పక్షాలకు ప్రాధాన్యత ఉంది. అయితే ఈసారి పెత్తర అమామాస్య(మహాలయ అమావాస్య) అక్టోబర్ 2వ తేదీన వచ్చింది. ఇదే రోజు గాంధీ జయంతి. పెద్దల పండుగ అంటేనే శక్తికొద్దీ మాంసాహారం, మద్యం ఉంటాయి. స్వర్గస్తులైనవారికి అవి రెండూ నైవేద్యంగా సమర్పిస్తారు. ఆతర్వాత ఇచ్చన వారు పుచ్చుకుంటారు. ఈసారి గాంధీ జయంతి రోజు రావడంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. గాంధీ జయంతి రోజు ప్రభుత్వం మద్యం, మాంసం దుకాణాలు తెరవడానికి అనుమతి లేదు. దీంతో ఇప్పుడు పెద్దలకు మద్యం, మాంసం ఎలా అని ఆందోళన చెందుతున్నారు.