వినాయక నిమజ్జనాలకు హై కోర్ట్ గ్రీన్ సిగ్నల్*

హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లో వినాయక విగ్రహాల నిమజ్జనాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

2021 సంవత్సరంలో ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేయడం లేదని ఓ పిటిషన్ దాఖలైంది.

అయితే చివరి క్షణంలో కోర్టు దృష్టికి తీసుకురావడం సరికాదని పిటిషన్ను కొట్టివేసింది.

తీర్పును అమలు చేయక పోవడం తప్పేనని వ్యాఖ్యానించిన ధర్మాసనం చివరి క్షణంలో అడ్డుకోలేమని పేర్కొంది.

దీంతో
యదావిధిగా నిమజ్జనాలు కొనసాగనున్నాయి.