నారాయణపేట జిల్లా: సెప్టెంబర్ 01
నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం తీవ్ర విషాదం నెలకొంది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుం డా జోరుగా కురుస్తున్న వర్షాలకు ఇల్లు కూలి తల్లి కూతుళ్లు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది..
నారాయణపేట జిల్లా , కొత్త పల్లి మండలం ఎక్కమేడు గ్రామంలో ఆదివారం తెల్లవారు జామున వర్షాల ధాటికి ఇల్లు కూలిన ఘటనలో తల్లి కూతుళ్లు మృతి చెందారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హనుమమ్మ (78) కు ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉండగా, భర్త చనిపోయిన రెండో కూతు రు అంజూలమ్మ (38)తో కలిసి నివాసం ఉండేది. కుమారుడు, కోడలు మరో ఇంట్లో ఉంటున్నారు.
గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆదివారం తెల్లవారుజామున ఇల్లు కూలడంతో నిద్రలోనే తల్లి కూతుళ్లు ఇద్దరు మృతి చెందారు.
విషయం తెలిసిన వెంటనే తహసిల్దార్ అనిల్ కుమార్ సంఘటన స్థలానికి చేరు కుని ప్రమాదానికి గల కారణాలను తెలుసు కున్నారు.
తాహసిల్దార్ మాట్లాడుతూ వాతావరణ శాఖ హెచ్చరికలు, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటికి వెళ్ళరాదని చెరువులు వాగులు సందర్శించరాదని ప్రజలకు సూచించారు…