ఖమ్మం జాతీయ రహదారి లో ఉన్న ఖిలా వరంగల్ పెట్రోల్ పంపు వద్ద నిత్యం వేయిల వాహనాలు ప్రయాణిస్తూ రద్దీ గా ఉండే వై జంక్షన్ ప్రస్తుతం ఎంత ఇరుకు గా తయారయిందో
మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ కు 100 అడుగుల దూరంలో ఉన్న ఈ Y జంక్షన్ నిత్యం ప్రమాదాలకు నిలయ మయింది..
చాలా సార్లు డివైడర్ కు మరియు సర్కిల్ గద్దె కు లారీలు గుద్దు కొని ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయి.
అక్కడే ప్రయాణికులకు మరియు వాహన చోదకులకు ఆటంకం కలిగించే విధంగా రోడ్లకు ఇరు వైపులా పండ్ల కొట్లు మరియు చిరు వ్యాపారులు వారి అమ్ముకునే వస్తువులను పరిచి ఉండడం వల్ల నిత్యం ఆ ప్రదేశంలో ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం కూడా జరుగుతున్నందున వెంటనే ట్రాఫిక్ పోలీసులు మరియు మున్సిపల్ అధికారులు స్పందించి ఇరుకు గా ఉన్న ఆ వై ఆకారపు జంక్షన్ వద్ద కుడా మాష్టర్ ప్లాన్ లో రోడ్డు ఎంత వెడల్పు ఉంటే అంత వెడల్పు చేసి ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి
ఈ విషయంలో ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు మరియు ప్రతి పక్ష నాయకులు వెంటనే స్పందించి అక్కడ నిత్యం జరిగే ప్రమాదాలను నివారించాలి అని కేడల ప్రసాద్ అనే నేనూ ధర్మ సమాజ్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుని గా డిమాండ్ చేస్తూ ఉన్నాను.