నల్గొండ జిల్లాలో ప్రవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రం వద్ద అద్దంకి- నార్కట్‌పల్లి రహదారిపై ప్రైవేటు బస్సు బోల్తాపడింది. ఘటనలో ప్రయాణికులు స్వల్పగాయా లతో బయటపడ్డారు.

జగిత్యాల నుంచి ప్రైవేటు బస్సు ప్రయాణికులతో దర్శికి బయలుదేరింది. అయితే ఆదివారం తెల్ల వారుజామున వేములపల్లి వద్దకు రాగానే బస్సు అదుపు తప్పి బోల్తాపడింది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బస్సు అద్దాలను పగలగొట్టి ప్రయాణికులను బయటకు తీశారు.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్న ట్లు, వారికి స్వల్ప గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. బస్సు రోడ్డుకు అడ్డంగా పడటంతో ట్రాఫిక్‌ కొంతసేపు స్తంభించింది.

పోలీసులు జేసీబీ, క్రేన్‌ సహాయంతో బస్సును రోడ్డుపై నుంచి తొలగింపజేశారు.