విషజ్వరంతో చిన్నారి మృతి

Aug 25, 2024,

విషజ్వరంతో చిన్నారి మృతి
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని భూంపల్లి గ్రామంలో మగ్గం మాన్యశ్రీ (12) మృతి చెందింది. శోభ – దిలీప్ దంపతుల చిన్న కుమార్తె మాన్యశ్రీ రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా కామారెడ్డి లోని ఓ ప్రైవేట్ దబాఖానాలో వైద్యం చేస్తున్నారు. వైద్యుల సూచనల మేరకు శనివారం హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గం మధ్యలోనే చిన్నారి మృతి చెందింది.