ప్రకృతి సంపదను విధ్వంసం చేస్తే అది ప్రజలపై
ప్రకోపిస్తుందని సీఎం రేవంత్ చెప్పారు. ‘చెన్నై,
వయనాడ్లో ప్రకృతి ప్రకోపం కళ్లారా చూశాం. ఈ
కూల్చివేతలకు రాజకీయాలకు సంబంధం లేదు.
భవిష్యత్ తరాలకు సరస్సులు, నదులు, చెరువులను
అందించాలనేది లక్ష్యం. కొందరు శ్రీమంతులు
చెరువుల్లో ఫాంహౌస్లు నిర్మించారు. వాటి డ్రైనేజీలను
గండిపేటలో కలిపారు. వాళ్ల విలాసం కోసం వ్యర్థాలు
చెరువులో కలుపుతారా?’ అని ఆయన ప్రశ్నించారు.