డెంగ్యూ ఫీవర్ తెలంగాణలో భారీగా పెరుగుతున్న డెంగ్యూ కేసులు.

తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీవర్షాలతో దోమలు వ్యాప్తిచెందడంతో హైదరాబాద్ (Hyderabad) నగరంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ కేసులు (Dengue fever) ఎక్కువైపోతున్నాయి.

ప్రతి ఇంట్లో ఒకరిద్దరు డెంగ్యూ తో బాధపడుతున్నారు. డెంగీతో పాటు వైరల్ జ్వరాలు కూడా ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పట్నం, పల్లె అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ జ్వరాలు విజృంభిస్తుండటంతో హాస్పిటల్స్ రోగులతో కిటకిటలాడుతున్నాయి. నిన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 5,500 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి. అనేక జిల్లాల్లో 100కు పైగా కేసులు నమోదు అవగా.. హైదరాబాద్ లో 2148, కరీంనగర్ 224, ఖమ్మం 641, మహబూబాబాద్ 103, మహబూబ్ నగర్ 120, మేడ్చల్ మల్కాజ్ గిరి 356, నల్గొండ 151, పెద్దపల్లి 155, రంగారెడ్డి 100, సంగారెడ్డి 132, సూర్యాపేట 222, వరంగల్ లో 208 కేసులు నమోదు అయినట్లు వైద్యులు తెలిపారు.

కానీ ఈ లెక్కలు చాల వరకు తప్పే..వీటిని డబుల్ఎం త్రిబుల్ గా కేసులు నమోదు అవుతున్నాయి. ప్రతి ఇంట్లో ఒకరైన డెంగ్యూ తో బాధపడుతున్నారంటే అర్ధం చేసుకోవాలి..రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ పంజా ఏ రేంజ్ లో ఉందొ.. డెంగ్యూ కేసులు భారీగా నమోదు అవుతుండటంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు రోగులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. అయితే, నిలోఫర్ ఆసుపత్రి పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. ఆస్పత్రిలో సరిపడ బెడ్స్ లేక ఒక్కో బెడ్ పైన ఇద్దరికీ పైగా పేషంట్స్ ను ఉంచుతున్నారు. ప్రభుత్వ హాస్పటల్స్ లలో సరైన వైద్య బృందం లేకపోవడం..టెస్ట్ లు చేసిన ఆ రిపోర్ట్స్ వచ్చేసరికి రెండు , మూడు రోజుల సమయం పడుతుండడంతో చాలామంది రోగులు ప్రవైట్ హాస్పటల్స్ కు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు.