వరంగల్ జిల్లా కేంద్రం నుంచి మహబూబాబాద్ కు తరలించిన అప్పటి ప్రభుత్వం
మహబూబాబాద్ లో సరైన సౌకర్యాలు లేవంటున్న పిల్లలు, సిబ్బంది
మళ్లీ వరంగల్ లోనే సదరం కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్లు
వరంగల్,
వరంగల్ జిల్లా కేంద్రంలో ఉండే ప్రభుత్వ బాలుర సదరం మహబూబాబాద్ కు తరలించడం ఇబ్బందులకు దారి తీస్తోంది. పిల్లలు, సిబ్బందికి అందుబాటులో ఉంటూ అన్ని వసతులు కలిగిన వరంగల్ బాలుర సదరాన్ని మహబూబాబాద్ లో ఏర్పాటు చేయడం అటు పిల్లలు, సిబ్బందికి లేనిపోని అవస్థలు కలగ చేస్తోం ది. మహబూబాబాద్ లోని బాలుర సదరంలో పిల్లలకు కనీస సౌకర్యాలు లేవని, సిబ్బందికి తగిన వసతులు కూడా లేవని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దూర ప్రాంతం నుంచి వచ్చే వారు ఇక్కడికి రావడానికి ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. 2007లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ జిల్లా కేంద్రంలో బాలుర సదరం కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. పాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న జనగామ, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ ప్రాంతాలతో పాటు కరీంన గ ర్, నిజామాబా ద్ జిల్లాలకు చెందిన బాలురు కూడా వరంగల్ సదరం కేంద్రం లోనే ఉండేవారు. దాదాపు దశాబ్దన్నర కాలంపాటు నిరాటంకంగా కొనసాగిన ఈ కేంద్ర