బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి భారీ షాక్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి బఫర్ జోన్లో అనురాగ్ యునివర్సిటీ నిర్మించారని కేసు నమోదు అయింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని వెంకటాపురంలో ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీ బఫర్ జోన్ లో నిర్మించారని పోచారం పీఎస్ లో ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరమేశ్వర్ ఫిర్యాదు చేశారు. మేడ్చల్ జిల్లాలోని వెంకటాపురం, నాదం చెరువుల బఫర్ జోన్ లలో అనురాగ్ యూనివర్సిటీ నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి.

చెరువును కబ్జా చేసి అనురాగ్ యూనివర్సిటీ మెడికల్ కళాశాల భారీ నిర్మాణం చేపట్టారని ఏఈ పరమేశ్వర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏఈ పరమేష్ ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.