మున్సిపల్ మంత్రిగా పదేళ్ల పాటు చేసిన పాపాల ప్రతిఫలమే ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెలుగు చూస్తన్న అక్రమ కట్టడాలని బీజేపీ ఎంపీ రఘునందన రావు పేర్కొన్నారు. ఎన్ కన్వెన్షన్ కూలగొట్టాలని హైకొర్టు 2014లో ఉత్తర్వుల ఇచ్చనా మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ పట్టించుకోలేదన్నారు. శనివారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. నగరంలో ఎన్నిచెరువులు దురాక్రమణకు గురయ్యాయో కేటీఆర్ కు తెలుసునన్నారు.అయినా పట్టించుకోకుండా అక్రమార్కుల కొమ్ముకాశారన్నారు.