24-08-2024
వరంగల్ తూర్పు నియోజకవర్గం;
ఈరోజు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు వరంగల్ పోస్ట్ ఆఫీస్ దగ్గరలో గల కృష్ణ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలను మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు తనిఖీ చేశారు. పాఠశాలలోని అన్ని తరగతి గదులను పరిశీలించిన కొండ మురళీధర్ రావు విద్యార్థులతో మాట్లాడి వారి యొక్క సమస్యలను మరియు పాఠశాలలో అందుతున్న సదుపాయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల పై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అన్ని సౌకర్యాలు కల్పించడంలో సఫలీకృతం అయిందని తెలిపారు. పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులుంటే కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకురావాలని అలాంటప్పుడే వాటిని సులభంగా పరిష్కరించవచ్చునని ప్రభుత్వ ఉపాధ్యాయులు అందుబాటులో ఉండి విద్యార్థిని విద్యార్థులకు మెరుగైన చదువు అందించాలని విద్యార్థినీ విద్యార్థులతో ఉపాధ్యాయులు మర్యాదగా మెలగాలన్నారు.పాఠశాల ఆవరణ
మొత్తం తిరిగి పరిశీలించి పాఠశాల ప్రాంగణం శుభ్రంగా ఉంచాలనీ తెలిపారు…
అలాగే దూపకుంట లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు త్వరితగతంగా పనులను పూర్తి చేయాలని పేదల కల సహకారం అయ్యేలా త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేస్తామని తెలియజేశారు..
అనంతరం వరంగల్ తూర్పు నియోజకవర్గం ఓ సిటీలోని కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు ప్రజల నుంచి విజ్ఞప్తులను వినతులను స్వీకరిస్తు ప్రజల సమస్యలను సావధానంగా వింటూ సంబంధిత శాఖల అధికారులతో అప్పటికప్పుడే ఫోన్ లో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు. దీర్ఘకాలంగా వేచి చూస్తున్న తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు ఎల్లవేళలా కొండా దంపతులు అందుబాటులో ఉంటారని ఏ సమస్యలున్నా ప్రజలు ఎలాంటి పైరవీలు చేయకుండా నిరభ్యంతరంగా తనను సంప్రదించవచ్చునని కార్యకర్తలకు నాయకులకు ఏ ఆపద వచ్చిన కొండా దంపతులు కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఈ సందర్భంగా కొండా మురళీధర్ రావు ప్రజలకు మరోసారి స్పష్టం చేశారు…