చిత్తూరు జిల్లా: ఆగస్టు24
ఏపీలో చోటుచేసుకుంటున్న వరుస ప్రమాదాలు అందరి నీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.
అచ్యుతా పురం సెజ్ లోని ఫార్మా కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదాన్ని మరువక ముందే మరో కంపెనీలో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈరోజు ఉదయం చిత్తూరు జిల్లాలో మరో విషాద ఘటన చోటుచేసు కుంది. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం పేలుడు సంభవించింది.
ఈ ప్రమాదంలో భార్యా భర్తలు మృతి చెందారు. బాణసంచా తయారీ కేంద్రం యజమాని ఖాదర్ బాషాతో పాటు ఆయన భార్య షహీనా ప్రాణాలు విడిచారు.
పేలుడుకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. బాణసంచా అమ్మకాల లైసెన్స్ తో వీరు ఏకంగా బాణసంచా తయా రీ కేంద్రాన్ని నడుపుతున్నా రని పోలీసులు గుర్తించారు.
బాణసంచా తయారీ కోసం తెప్పించుకున్న నల్లమందే పేలుడుకి కారణమా అనే అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.