రాజన్న జిల్లాలో బైక్ ఆర్టీసీ బస్సు డి ఒకరికి తీవ్ర గాయాలు

రాజన్న జిల్లా:ఆగస్టు24
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మరం గ్రామ సమీపంలో ఈరోజు ఉదయం ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొన్న ఘటన లో వ్యక్తికి తీవ్ర గాయాల య్యాయి.

ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామానికి చెందిన ఆర్.వెంకట్రాజం కోనరావువుపేట మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ లో లైన్మెన్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు.

ఈ క్రమంలో విధులు ముగించుకొని సిరిసిల్లకు వెళుతుండగా ధర్మారంలోని కల్వర్టు వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్ర గాయాల య్యాయి.

స్థానికులు గాయపడ్డ వ్యక్తిని అంబులెన్స్ లో సిరిసిల్ల హాస్పిటల్ కి తరలించారు.