N. కన్వెన్షన్ కూల్చివేత.. స్పందించిన హీరోనాగార్జున

శేరిలింగంపల్లి: టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ‘ఎన్ కన్వెన్షన్‌’ను శనివారం ఉదయం హైడ్రా అధికారులు కూల్చివేశారు…

హైదరాబాద్ మాదాపూర్‌లోని తుమ్మకుంటలో చెరువును ఆక్రమించి మూడు ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదు వచ్చింది. దీంతో పక్కా ఆధారాలతో శనివారం తెల్లవారుజాము నుంచే అధికారులు కూల్చివేత ప్రారంభించారు. తాజాగా.. ఈ కూల్చివేతపై అక్కినేని నాగార్జున స్పందించారు.

ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారు. తాను ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదు. ఆ భూమి పట్టా భూమి. కోర్టు కేసులకు విరుద్ధంగా కూల్చివేయడం బాధాకరం. అధికారులు చట్టవిరుద్ధంగా చేసిన చర్యలపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఇప్పుడే కాదు ఎప్పుడూ ఎలాంటి చర్యలకు పాల్పడలేదు. N-కన్వెన్షన్ను కూల్చివేయాలని గతంలో ఇచ్చిన నోటీసులపై తాము కోర్టుకు వెళితే.. కోర్టు స్టే ఇచ్చింది. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడటం బాధాకరం. ఒకవేళ కోర్టులో తమకు వ్యతిరేకంగా తీర్పు వస్తే దగ్గరుండి నేనే కూల్చేవాడిని” అని నాగార్జున అన్నారు.