తెలంగాణలో మరో ఐదు రోజులు భారీ వర్షాలు

Aug 23, 2024,

తెలంగాణలో మరో ఐదు రోజులు భారీ వర్షాలు
తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని, గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.