వరంగల్ తూర్పు నియోజకవర్గం;
కార్యకర్తలను, నాయకులను కంటికి రెప్పలా కాపాడుకుంటాం.. *___మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు గారు*
ఈరోజు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు గారు వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని 22వ డివిజన్ పోచమ్మ గుడి సమీపంలోని రోడ్డుకి ఇరువైపులా ఉన్న డబ్బాలను ఇటీవల తొలగించగా ఉపాధి కోల్పోయిన వారికి భరోసా కల్పించేందుకు ఈరోజు వెళ్లి బాధితులను పరామర్శించి బాధితులతో మాట్లాడి వారి యొక్క స్థితిగతులను తెలుసుకొని ఆర్థిక సహాయం అందజేసి భరోసా కల్పించి మీకు త్వరలోనే మళ్లీ మీ వ్యాపారాలు చేసుకునేలా అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది….
అనంతరం వరంగల్ తూర్పు నియోజకవర్గం ఓ సిటీలోని కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు గారు ప్రజల నుంచి విజ్ఞప్తులను వినతులను స్వీకరిస్తు ప్రజా సంక్షేమం శ్రేయస్సే పరమావధిగా ప్రజల సమస్యలను సావధానంగా వింటూ కొండా మురళి గారు సంబంధిత శాఖల అధికారులతో అప్పటికప్పుడే ఫోన్ లో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు. దీర్ఘకాలంగా వేచి చూస్తున్న తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు ఎల్లవేళలా కొండా దంపతులు అందుబాటులో ఉంటారని ఏ సమస్యలున్నా ప్రజలు ఎలాంటి పైరవీలు చేయకుండా నిరభ్యంతరంగా తనను సంప్రదించవచ్చునని కార్యకర్తలకు నాయకులకు ఏ ఆపద వచ్చిన కొండా దంపతులు కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఈ సందర్భంగా కొండా మురళీధర్ రావు గారు ప్రజలకు స్పష్టం చేశారు…