నైట్ టైమ్‌లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యమంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పోస్టుపై పోలీసులు స్పందించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో పోలీసులకు ఫోన్ చేస్తే ఉచితంగా ఇంటివద్ద దింపుతారు. 1091, 78370 18555 నంబర్‌కు ఫోన్ చేస్తే స్థానిక పోలీసుల వాహనం వచ్చి తీసుకెళ్తుందనేది అందులోని సారాంశం. సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో పోలీసులు దీనిని ఖండించారు. ఇది తప్పుడు సమాచారం అంటూ హైదరాబాద్ పోలీసులు వివరణ ఇచ్చారు. ఇలాంటి తప్పుడు మెసేజ్‌లను వైరల్ చేస్తున్న వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.