అమరావతి
అన్నక్యాంటీన్, అమరావతి రాజధాని నిర్మాణానికి పలువురు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని బుధవారం సచివాలయంలో కలిసి చెక్కులు అందించారు. విజయవాడకు చెందిన పారిశ్రామిక వేత్త, డీఆర్ఎన్ ఠాగూర్ గ్రూప్ చైర్మన్ ధనేకుల రవీంద్రనాథ్ ఠాగూర్ అమరావతి రాజధాని, అన్న క్యాంటీన్ లకు కోటి రూపాయలు చొప్పున రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చారు. కడప జిల్లా, పాయసంపల్లెకు చెందిన ఎన్వీ నారాయణ రెడ్డి రాజధానికి 5. 10,00,116 విరాళంగా అందించారు. రాజధానిలో భాగస్వామ్యం కావాలనే స్ఫూర్తితో, పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్కు చేయూతను ఇవ్వాలనే మంచి ఆలోచనతో విరాళం ఇచ్చిన రవీంద్రనాథ్ ఠాకూర్, ఎన్వీరమణారెడ్డిలను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు.