ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడిగా పోచారం
తెలంగాణ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడిగా పోచారం శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. కేబినెట్ హోదాలో పోచారం శ్రీనివాసరెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ డెయిరీ అభివృద్ధి సహకార సమాఖ్య ఛైర్మన్‌గా గుత్తా అమిత్ రెడ్డిని నియమించారు. గత బీఆర్ఎస్ హయాంలో పోచారం వ్యవసాయ శాఖ మంత్రిగా, స్పీకర్ గా పనిచేశారు.