జిల్లా సహకార బ్యాంకుల సీఈఓ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చైర్మన్ మార్నెనీ రవీందర్ రావు


టేస్కాబ్ కార్యాలయం
హైదరాబాద్

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డిసిసిబి) బ్యాంక్ ల సీఈఓ లతో మరియు బ్యాంక్ సిబ్బంది తో తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నెనీ రవీందర్ రావు గారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు…

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

👉రుణ మాఫీ 2024 కింద లబ్ధి పొందిన రైతులకు త్వరగతిన తిరిగి కొత్త పంట రుణాలు ఇవ్వవలసిందిగా సూచించారు..

👉అదేవిధంగా అర్హత గల రైతులకు సంబంధించిన ఇన్వాలీడ్ ఆదార్ లు గా ఉన్నటువంటి ఎర్రర్ లను ప్రభుత్వం వారి అనుమతితో త్వరగతిన సరియైన ఆధార్ కాపీలను సమర్పించి రైతులకు లబ్ధి చేకూరేలా చేయాలని సూచించారు..

👉అర్హులైన రైతుల యొక్క రుణాలను ప్రభుత్వానికి సమర్పించడంలో అలసత్వాన్ని ప్రదర్శించిన సంఘాల సిబ్బందిని భాద్యులను చేయవలసిందిగా సంబధిత డిసిఓ లకు సమాచారం ఇవ్వాలని బ్యాంక్ సీఈఓలను ఆదేశించారు

👉ప్రతి సంఘాలను సందర్శించి ఋణ మాఫీ పొందిన రైతులకు విలైనంత త్వరగా తిరిగి రెన్యువల్ చేయాల్సిందిగా తద్వారా రైతులకు వానాకాలం పంటల సాగుకు పెట్టుబడి ఇబ్బందులు తలెత్తకుండా సాగు చేస్తారని సూచించారు.

👉లోన్ రికవరీ మరియు పాలసీ మార్గదర్శకాలపై,విద్య రుణాలు,దీర్ఘకాలిక రుణాలు, బంగారం రుణాలు,డిపాజిట్స్ పై వారు సమీక్ష చేయడం జరిగింది..

ఈ సమావేశంలో టేస్కాబ్ సిజిఏం జ్యోతి, జిఏం సురేఖ, డీజీఏం లు మరియు సిబ్బంది పాల్గొన్నారు…