మహిళలకు సీఎం బట్టి విక్రమార్క శుభవార్త

తెలంగాణ* మహిళలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. డ్వాక్రా మహిళలకు ఏటా రూ.20 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇస్తామని అన్నారు..

మహిళా సంఘాలకు వచ్చే ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల రుణాలు ఇస్తామని కీలక ప్రకటన చేశారు. అతి త్వరలోనే రాష్ట్రంలోని ఇళ్లు పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 3500 ఇళ్లకు భూమి పూజ చేస్తామని ప్రకటించారు.

అంతేకాదు.. రూ.2 లక్షల పైన రుణం ఉన్న రైతులు పైమొత్తం చెల్లించాలని సూచించారు. పైమొత్తం చెల్లించి వ్యవసాయ శాఖకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. సంబంధిత శాఖ అధికారులకు సమాచారం అందిన వెంటనే రూ.2 లక్షల రుణం మాఫీ అవుతుందని అన్నారు. గత బీఆర్ఎస్ పాలకులు పదేళ్లు కాలయాపన చేశారు కానీ ఏనాడూ రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. గత ఐదేళ్లు పంటల బీమా కూడా వేయలేదు అని గుర్తుచేశారు. తాము అధికారంలోకి రాగానే పంటల బీమా చెల్లించామని తెలిపారు. రైతులు కట్టాల్సిన డబ్బులను బీమా కంపెనీలకు ప్రభుత్వమే చెల్లించిందని అన్నారు..